ప్రతిభ/మెరిట్ అంటే ఏమిటి?
నీ తల్లిదండ్రులు కూలిపనులు చేసి ఏపూటకాపూట తిండిగింజలు తెచ్చుకుని తినే క్రమంలో, సరైన పోషకాహారం తినని తల్లికి నువ్వు అనారోగ్యంతో వూర్లో మంత్రసాని చేతుల్లోనో, పట్టణంలోని మురికివాడలో అయితే గవర్నమెంటు దవాఖానాలొ పురుడుపోసుకుని, సరిగ్గా పాలు రాని నీ తల్లినుండి వేరై పోతపాలతో బ్రతికి, వూహ తెలిసినప్పటినుండి ఇంటిపనుల్లోనో, చుట్టూ వున్న చెడు పిల్లల సావాసంలో, పట్టించుకోని తల్లిదండ్రుల వద్ద పెరిగి, ఏ ఆరో, ఏడో ఏటనో బలవంతంగా బడికి పంపబడి, అక్కడ అయవార్లతో ఏరా మంగలోడా, కురువోడా, ఎస్సీనాయాలా అని పిలిపించుకొని, మీ కులాలకు చదువెక్కడొస్తుందనే తీర్మానన్ని బలంగా తలకాయలో ఎక్కించుకొని, మొదటిసారి అక్షరాలు అక్కడే చూసి, అవంటే భయంకర రూపాలుగా ముద్రపడి, ఏటేటా ఆ రూపాలు మరింత భీభత్సంగా తయారై, ఒక పక్క అప్పుడప్పుడూ తల్లిదండ్రితో కూలినాలి పనులతో పాటు వానకాలం చదువులు చదువుకొంటూ, పల్లెలో స్కూలైపోతే తల్లిదండ్రులకు ఎక్కడో ఆశ మొలకెత్తి, ఏ పుణ్యాత్ముడైనా పక్కనున్న పట్టణంలోని గవర్నమెంటు హస్టల్లో పడేస్తే;
అక్కడ పురుగులన్నం తినలేక తింటూ, వార్డెన్లూ, వాచ్‌మెన్లూ తిట్లూ, తన్నులూ భరిస్తూ, సీనియర్ల సైకిక్ వేధింపులూ తట్టుకుని, రోజూ స్నానం చేయలేని దుస్తితిలో, శరీరమంతా గజ్జీ తామరలతో, మాసికలు పడి దుర్వాసన కొట్టే దుస్తుల్లో, యూనిఫాం లేక ప్రేయర్లో వెనక ఎంత దొంగతనంగా నిలబడినా దొరికిపోయి, అందరూ తరగతి గదిలోకి పోయాక, గ్రౌండ్లోనే డ్రిల్ మాస్టరుకి నచ్చిన శిక్షలు అనుభవించి, సగం పాఠమయ్యాక ఎంటరైన తరగదిలో అందరికన్నా వెనక కూర్చోవాల్సి వచ్చి, సరైన పోషణలేని శరీరంతో, వారసత్వంగా వచ్చే లక్షణాలతో నల్లగా, పొట్టిగా, అనాకారిగా పెరగడంతో క్లాసులో ఎవరితోనూ స్నేహం దొరక్క, పాఠం చెబుతున్నప్పుడు డౌటడిగితే, తనవద్దకు ట్యూషన్ రాని అర్భకుడికి నేను డౌటు క్లియర్ చేయడమేందని, నీ బ్రతుక్కి డౌటుకూడానా అని మరెప్పటికీ లేవకూడని అవమానం లెక్కలు, సైన్సు టీచరల చేత అనుభవించి, తిండిలేని నీరసంతోనో, రాత్రుళ్లు సీనియర్ల హోమో సెక్సువాలిటీనుండి తప్పించుకోవడానికో జాగారం చేసిన కారణంతోనో కునికిపాటు పడినప్పుడు, వీపుమీద చెళ్లుమన్న బెత్తం దెబ్బతో నిద్రలేచి బయటకు పంపబడి;
ఏ తొమ్మిది, పదో తరగతిలోనో నాకు చదువే దిక్కని నిర్ణయించుకొని చదవబోతే మొదటిసారి బలవంతంగా పుస్తకాలని చదవబోతే, చదువు అర్థంకాక అక్షరాలు కన్నీళ్లలో అలుక్కుపోయినా పట్టువదలకుండా తనలాగే వెలగలెక వెలిగే బల్బు కాంతిలోనో, రోడ్డుపక్కన బార్‌లైటు వెలుగులో దోమలతో పోరాడుతూ ఇంటర్మీడియట్ గట్టెక్కితే; అదృష్టం బాగుండి చదువులో ముందుకుపోతే, తినీతినక, పార్ట్‌టైం ఉద్యోగాలు చేస్తూ, బ్రతుకులో వెలుగు చప్పున ఆరిపోయిందనె కలవస్తే ఉలిక్కిపడి ఎన్నోసార్లు నిద్రలేని రాత్రులు గడిపితే ఏదైనా భవిష్యత్తుకి భరోసా నిచ్చే సీటు తెచ్చుకుంటే లేదా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుంటే దాన్ని ప్రతిభ/ మెరిట్ అంటారు.
బలిసిన కులంలో పుట్టి, ఆర్థికంగా బలిమిగల, తరాలుగా చదువున్న కుటుంబంలో పెరిగి, అత్యుత్తమ కాలేజీలూ, ట్యూషన్లూ, కోచింగులూ అనుభవిస్తూ సీట్లూ, ఉద్యోగాలూ తెచ్చుకుంటే అది ప్రతిభ/మెరిట్ కాదు. కేవలం తన తరాల బ్యాక్‌గ్రౌండుని ప్రదర్శించడం మాత్ర
Blog
-
ప్రతిభ/మెరిట్ అంటే ఏమిటి?